టీకా తీసుకొని సురక్షితంగా ఉండండి: సీఎస్ సోమేశ్ కుమార్

by Shyam |
టీకా తీసుకొని సురక్షితంగా ఉండండి: సీఎస్ సోమేశ్ కుమార్
X

తెలంగాణ బ్యూరో: టీకా తీసుకొని సురక్షితంగా ఉండాలని సీఎస్ సోమేశ్ కుమార్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ఏళ్ల పైబడిన వారంతా తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రెండు కోట్ల పంపిణీ పూర్తి సందర్భంగా బి ఆర్ కే భవన్ లో బుధవారం సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తీసుకొని వైరస్ బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలన్నారు. తెలంగాణలో కరోనా కంట్రోల్లో ఉందన్నారు. అయితే పూర్తిస్థాయిలో నియంత్రణకు ప్రజలు సహకరించాలన్నారు.

రాష్ట్రంలో ఒక కోటి డోసుల పంపిణీకి 167 రోజుల సమయం పడితే.. రెండు కోట్ల చేరుకోవడానికి కేవలం 75 రోజుల సమయం పట్టిందన్నారు. క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు వైద్య ఆరోగ్య సిబ్బంది అద్భుతంగా పని చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సెక్రెటరీ రిజ్వి, డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ జీ శ్రీనివాసరావు,సీఎం ఓస్డ్ డి డా గంగాధర్ tsmsidc ఎండి చంద్రశేఖర్ రెడ్డి, హైదరాబాద్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed