- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గన్‌తో కాల్చుకుని CRPF జవాన్ ఆత్మహత్య
by Sumithra |
X
దిశ, శేరిలింగంపల్లి: మియాపూర్ నడిగడ్డ తండాలో CRPF క్యాంప్‌లో విధులు నిర్వహిస్తున్న జవాన్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మియాపూర్ పోలీస్ ఇన్స్ పెక్టర్ సామల వెంకటేశ్ తెలిపిన వివరాల ప్రకారం… గుజరాత్ కు చెందిన శంకర్ ఠాకూర్ 2016 నుంచి మియాపూర్ నడిగడ్డ తండాలో ఉన్న సీఆర్ పీఎఫ్ క్యాంపులో విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో శంకర్ ఠాకూర్ తన వద్ద ఉన్న ఎస్ ఎల్ ఆర్ రైఫిల్ తో తనకు తానే ఫైర్ చేసుకున్నాడు.
ఈ ఘటనలో శంకర్ ఠాకూర్ గొంతు భాగం నుంచి తూటా తల లోపలికి దూసుకుపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. శంకర్ ఠాకూర్ కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకోవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Advertisement
Next Story