- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇలాగైతే కరోనా కంట్రోల్ కష్టమే!
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ఆదివారం ఏకంగా 5 వేల కేసులు పైబడే నమోదు కావడంతో వైరస్ తీవ్రత ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. గత రెండు రోజుల్లోనే రాష్ట్రంలో పదివేలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఇక తూర్పు గోదావరి, కర్నూలు, గుంటూరు, అనంతపురం జిల్లాలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు బయటకు రావొద్దని, సామజిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని ప్రభుత్వం, అధికారులు, పోలీసులు ప్రతిరోజూ ప్రచారం చేస్తున్నారు.
అయినప్పటికీ ప్రజల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. దీనికి ఉదాహరణ ఈ ఫోటో. ఆదివారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో కర్ఫ్యూ విధించారు. అయితే మరుసటి రోజు సోమవారం ఉదయం రోడ్ల మీదకు జనాలు ఇలా భారీ సంఖ్యలో వచ్చేశారు. కరోనా నిబంధనలు తమకేం పట్టనట్టు, కనీసం మాస్కులు పెట్టుకోకుండా రోడ్లమీదకు రావడంతో అధికారులు షాక్ అయ్యారు. ఇలా జనాలు రోడ్లపై తిరిగితే కరోనాను కంట్రోల్ చేయడం కష్టమని అధికారులు వాపోయారు.