- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గండి పడింది.. కారణం మీకు తెలుసు!
దిశ, రంగారెడ్డి: ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఆదుకునే ఏకైక శాఖ ఎక్సైజ్ శాఖ మాత్రమే. కానీ, ఇప్పుడు ఆ ఎక్సైజ్ శాఖ ఆదాయానికి గండి పడింది. కరోనా వైరస్ వ్యాప్తితో దేశం అతలాకుతలం అవుతోంది. ఆ వైరస్‌ను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. దీంతో మద్యం షాపులను పూర్తిగా మూసివేశారు. దీంతో మద్యం షాపులతో రోజుకు కోట్ల రూపాయలుగా వచ్చే ఆదాయాన్ని ఎక్సైజ్ శాఖ కోల్పోతున్నది.
రూ. 380 కోట్లు నష్టం…
రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తోంది. అందుచేత లాక్‌డౌన్ పొడిగించడంతో తెలంగాణ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రాకుండా పోతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఇలాంటి ఆపత్కాలంలో ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం దగ్గర నగదు లేదు. మార్చి 22 నుంచి సోమవారం వరకు సుమారుగా రూ.380 కోట్ల ఆదాయం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ శాఖ నష్టపోయింది. మే 7వ తేదీ వరకు లాక్ డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో మరో రూ.350కోట్ల ఆదాయం కోల్పోయే అవకాశం ఉంది.
మార్చి 21 వరకు రూ.331 కోట్లు…
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ ఆదాయము ప్రధాన వనరు. మద్యం షాపులు మూతపడటంతో ఆదాయ వనరు సమకూర్చుకోవడంలో ప్రభుత్వం ఇబ్బంది పడుతోన్నది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 420 మద్యం షాపులున్నాయి. రంగారెడ్డిలో 195 షాపులు, మేడ్చల్‌లో 179, వికారాబాద్‌లో 46 షాపులున్నాయి. ఉమ్మడి జిల్లాలో మార్చి ఒకటి నుంచి 21వ తేదీ వరకు రూ.331 కోట్లు ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్ శాఖాధికారులు తెలిపారు. 4 లక్షల 34 వేల ఐఎంఎల్ కేసులు, 6 లక్షల 52 వేల బీరు కేసుల విక్రయాల ద్వారా ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
పెరిగిన కల్లు డిమాండ్…
మద్యం ప్రియులకు మద్యం అందుబాటులో లేకపోవడంతో కల్లు తాగేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మద్యం లేక కొంతమంది పీకలు కోసుకోవడం, ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇంకొంతమందికి మానసిక ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో ఆసుపత్రిలో చేర్పించారు. ఇలాంటి వాళ్లకు ఏదో ఒక మత్తు కావాలి. అందుకోసం కల్లు తాగేందుకు క్యూ కడుతున్నారు.
Tags: Rangareddy, liquor, excise department, Loss, Telangana government, corona effect