- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ విన్నర్స్… సమంత, నాని
దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మారి ప్రభావానికి ప్రపంచ సినీరంగం కుదేలైంది. మాల్స్, థియేటర్లు మూతపడగ… సినిమాలు, అవార్డుల ప్రధానోత్సవాలు అన్నీ వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే మార్చి 14న అట్టహాసంగా జరగాల్సిన క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం కూడా రద్దైంది. అయితే ప్రతీ ఏడాది అట్టహాసంగా నిర్వహించే కార్యక్రమాన్ని జరుపుకోలేకపోయినా విజేతలను ప్రకటించారు నిర్వాహకులు.
తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠి, బెంగాలీ, గుజరాతి సినీ ఇండస్ట్రీల్లో అత్యుత్తమ ప్రతిభకనబరిచిన విజేతల పేర్లు ప్రకటించగా…. తెలుగులో ‘ఓ బేబి’ చిత్రానికి గాను ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకుంది హీరోయిన్ సమంత. ‘జెర్సీ’ సినిమాలో నటనకు ప్రశంసలు అందుకున్న నేచురల్ స్టార్ నాని ఉత్తమ నటుడి పురస్కారానికి ఎంపికయ్యారు. ఉత్తమ చిత్రంగా ‘మల్లేశం’ నిలవగా… ఉత్తమ దర్శకుడిగా గౌతమ్ తిన్ననూరి ( జెర్సీ) … ఉత్తమ రచయితగా వివేక్ ఆత్రేయ (బ్రోచేవారెవరురా) ఎన్నికయ్యారు. తమిళ్‌లో ‘సూపర్ డీలక్స్’ చిత్రానికి నాలుగు అవార్డులు రాగా… హిందీ ‘గల్లీబాయ్’ చిత్రానికి మూడు అవార్డులు దక్కాయి.
The #CriticsChoiceFilmAwards recognized and rewarded the best cinema from 8 Indian languages. We here by announcing the Telugu language winners
A big congratulations to all the winners@motion_content @VMC_sg @theFCGofficial @airtelindia @airtelindia @nameisnani @Samanthaprabhu2 pic.twitter.com/4pYhFUbwvy— Critics Choice Film Awards (@CCFAwards) March 28, 2020
తెలుగు క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ :
ఉత్తమ నటి – సమంత అక్కినేని ( ఓ బేబి)
ఉత్తమ నటుడు – నాని (జెర్సీ)
ఉత్తమ చిత్రం – మల్లేశం
ఉత్తమ దర్శకుడు – గౌతమ్ తిన్ననూరి(జెర్సీ)
ఉత్తమ రచయిత – వివేక్ ఆత్రేయ (బ్రోచేవారెవరురా)
The #CriticsChoiceFilmAwards recognized and rewarded the best cinema from 8 Indian languages. We here by announcing the TAMIL language winners!
A big congratulations to all the winners!@motion_content @VMC_sg @theFCGofficial @VijaySethuOffl @Amala_ams @itisthatis @airtelindia pic.twitter.com/ZboqOASYfI— Critics Choice Film Awards (@CCFAwards) March 28, 2020
తమిళం క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ :
ఉత్తమ నటి – అమలాపాల్ ( ఆడై )
ఉత్తమ నటుడు – విజయ్ సేతుపతి (సూపర్ డీలక్స్)
ఉత్తమ చిత్రం – సూపర్ డీలక్స్
ఉత్తమ దర్శకుడు – త్యాగరాజన్ కుమారరాజా(సూపర్ డీలక్స్)
ఉత్తమ రచయిత – త్యాగరాజన్ కుమారరాజా, నలన్ కుమారస్వామి, మిస్కిన్, నీలం కె శేఖర్(సూపర్ డీలక్స్)
The #CriticsChoiceFilmAwards recognized and rewarded the best cinema from 8 Indian languages. We here by announcing the TAMIL language winners!
A big congratulations to all the winners!@motion_content @VMC_sg @theFCGofficial @VijaySethuOffl @Amala_ams @itisthatis @airtelindia pic.twitter.com/ZboqOASYfI— Critics Choice Film Awards (@CCFAwards) March 28, 2020
హిందీ క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ :
ఉత్తమ నటి – గీతికా విద్యా ఓహ్ల్యాన్ (సోనీ)
ఉత్తమ నటుడు – రణ్‌వీర్ సింగ్ (గల్లీబాయ్)
ఉత్తమ చిత్రం – గల్లీబాయ్
ఉత్తమ దర్శకుడు -జోయా అక్తర్ (గల్లీబాయ్)
ఉత్తమ రచయిత – అనుభవ్ సిన్హా, గౌరవ్ సోలాంకీ (ఆర్టికల్ 15)
The #CriticsChoiceFilmAwards recognised and rewarded the best cinema from 8 Indian languages. We announcing the HINDI language winners!
A big congratulations to all the winners!@motion_content @VMC_sg @theFCGofficial @RanveerOfficial @GeetikaVidya @ZoyaAkhtarOff @airtelindia pic.twitter.com/Yvy1Z6dNB2— Critics Choice Film Awards (@CCFAwards) March 28, 2020
మలయాళం క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ :
ఉత్తమ నటి – పార్వతి(ఉయరే)
ఉత్తమ నటుడు – మమ్ముట్టి(ఉండ)
ఉత్తమ చిత్రం – కుంబలంగి నైట్స్
ఉత్తమ దర్శకుడు – ఆషిక్ అబు(వైరస్)
ఉత్తమ రచయిత – శ్యాం పుష్కరణ్(కుంబలంగి నైట్స్)
The #CriticsChoiceFilmAwards recognized and rewarded the best cinema from 8 Indian languages. We here by announcing the MALAYALAM language winners!
A big congratulations to all the winners!@motion_content @VMC_sg @theFCGofficial @mammukka @airtelindia
@parvatweets pic.twitter.com/tl9I2en5Cy— Critics Choice Film Awards (@CCFAwards) March 28, 2020
కన్నడ క్రిటిక్స్ ఛాయిస్ ఫిల్మ్ అవార్డ్స్ :
ఉత్తమ నటి – బి. జయశ్రీ(ముకజ్జియా కనసుగలు)
ఉత్తమ నటుడు – రిషి(కవలుదారీ)
ఉత్తమ చిత్రం – బెల్ బాటమ్
ఉత్తమ దర్శకుడు – జయతీర్థ(బెల్ బాటమ్)
ఉత్తమ రచయిత – దయానంద టీకే (బెల్ బాటమ్)
The #CriticsChoiceFilmAwards recognized and rewarded the best cinema from 8 Indian languages.We here by announcing the KANNADA language winners!
A big congratulations to all the winners!@motion_content @VMC_sg @theFCGofficial @Rishi_vorginal @airtelindia pic.twitter.com/yJaqapqmqs— Critics Choice Film Awards (@CCFAwards) March 28, 2020
Tags: Critics Choice Film Awards, CCFA, Tollywood, Samantha, Nani