- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రెస్ మీట్‌లో కోక్ బాటిల్స్ తీసేసిన రొనాల్డో
దిశ, స్పోర్ట్స్: యూరో కప్ 2020లో డిఫెండింగ్ ఛాంపియన్ పోర్చుగల్ మంగళవారం తమ తొలి మ్యాచ్ హంగేరీతో ఆడింది. మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ మీట్‌లో పోర్చుగల్ కెప్టెన్ క్రిస్టియానో రొనాల్డో పాల్గొన్నాడు. కాగా, ప్రెస్ మీట్ టేబుల్ మీద కోకాకోలా బాటిల్స్ ఉండటంపై రొనాల్డో నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన ముందు ఉన్న రెండు కోక్ బాటిల్స్ పక్కన పెట్టడమే కాకుండా ‘నీళ్లు తాగండి’ అంటూ గట్టిగా నినాదాలు చేశాడు. 36 ఏళ్ల రొనాల్డో తన డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. యూరో కప్ స్పాన్సర్లలో కోకా కోలా కంపెనీ కూడా ఉన్నది.
అందుకే ప్రెస్ మీట్లలో ఆ డ్రింక్ బాటిల్స్ కనిపించేలా ప్రదర్శిస్తుంటారు. అయితే బేవరేజెస్, మద్యం కంపెనీల యాడ్స్‌కు దూరంగా ఉండే రొనాల్డో.. స్పాన్సర్ అని కూడా చూడకుండా కోక్ బాటిల్స్ పక్కన పెట్టడం చర్చనీయాంశంగా మారింది. రొనాల్డో రోజుకు 6 సార్లు చిన్న మీల్స్ తింటాడు. అంతే కాకుండా రోజుకు 5 సార్లు 90 నిమిషాల చొప్పున నిద్రపోతాడు. ప్రతీదీ టైం టేబుల్ ప్రకారమే చేస్తుంటాడని సన్నిహితులు చెబుతుంటారు. మధ్యలో ఎప్పుడైనా ఆకలేస్తే కేవలం ఆవకాడో టోస్ట్ మాత్రం తింటాడు.