- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రామతీర్థ ఘటనలో నిందితులను వదిలేది లేదు : అవంతి
దిశ, విశాఖపట్నం : రామతీర్థం ఘటన దురదృష్టకరం.. రాముని విగ్రహాలు ధ్వంసం చేసిన వారిని ప్రభుత్వం కఠినంగా శిక్ష ఇస్తుందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం విశాఖలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనలో కుట్ర కోణం ఉందని దానిని ఛేదిస్తామన్నారు. ప్రతిపక్షనేత చంద్రబాబు అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి, డీజీపీ మతాలు కోసం మాట్లాడడం చాలా బాధ కలిగించిందన్నారు.
రాష్ట్రం లో ఇతర దేవాలయల పై దాడులు జరిగినప్పుడు సందర్శించని చంద్రబాబు రామతీర్థం ఎందుకు సందర్శించారో చెప్పాలన్నారు. తన సొంత జిల్లాలో ఉన్న తిరుమలకు వెళ్లి చంద్రబాబు ఒక్క సారి అయిన తలనీలాలు ఇచ్చారా?” అంటూ ప్రశ్నించారు.బీజేపీ, జనసేన కు దేవుళ్ళు పై ఎంత భక్తి ఉందో మాకు అంతే భక్తి ఉందని, బీజేపీ, జనసేన పార్టీ లకు రాష్ట్రం పై అభిమానాం ఉంటే విభజన హామీలను అమలుకు కృషి చేయాలని,దయ చేసి చంద్రబాబు ట్రాప్ లో పడవద్దు అని కోరారు. మా పార్టీ పై క్రిస్టియన్ ముద్ర వేయాలని చూస్తున్నారుని, వైసీపీ లో 90 శాతం కు పైగా హిందువులు ఉన్నారన్నారు. మాత విద్వేషాలు రెచ్చగొట్టే ధోరణిని చంద్రబాబు మానుకోవాలన్నారు.