- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పక్కా స్కెచ్.. జేసీబీతో భారీ చోరీ
దిశ, వెబ్‌డెస్క్ :
పట్టపగలే జేసీబీ సాయంతో చోరీకి పాల్పడుతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎనిమిది మంది ముఠా సభ్యులు MTNL ల్యాండ్‌లో జేసీబీని ఉపయోగించి అండర్‌గ్రౌండ్ కేబుల్స్‌ను తవ్వి తీస్తున్నారు. అనంతరం అందులోని కాపర్‌ను సపరేట్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారు.
చోరీ సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముఠా నాయకుడు పక్కగా ప్రణాళిక రచించాడు. MTNL నుంచి ఒక నకిలీ ఆర్డర్ కాపీని సృష్టించి ఈ ప్రాంతంలో తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లు లేఖలో పేర్కొన్నాడు. ఎవరికీ సందేహం కలగకుండా వర్కర్ల వలే రెడీ అయి అన్ని భద్రతా నిబంధనలు పాటిస్తూ ఆపరేషన్‌ను అమలు చేశారు.
బాధిత కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని నిందితులను అదుపులోకి తీసుకున్నారు.ఈ ముఠా నాయకుడు అజారుద్దీన్ ఇప్పటికే ఇలాంటి మూడు చోరీల్లో నిందితుడిగా ఉన్నాడు. ముఠా సభ్యుల స్వస్థలం బీహార్‌లోని తరన్ గ్రామం అని తెలుస్తోంది. నిందితుల నుంచి రూ.6 లక్షల విలువైన రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.