పిడుగు పడి మహిళ మృతి…

by Kalyani |   ( Updated:2024-09-22 13:47:32.0  )
పిడుగు పడి మహిళ మృతి…
X

దిశ, బిజినేపల్లి: పిడుగు పడి ఓ మహిళ మృతి చెందిన సంఘటన మమ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బిజినేపల్లి మండలం మమ్మాయిపల్లి గ్రామానికి చెందిన నీలమ్మ (35) పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందింది. ఆదివారం ఉదయం అక్క నాగేంద్రమ్మ తో కలిసి రోజువారీగా గేదెలను మేపడానికి వెళ్లగా భారీ వర్షం కురవడంతో పిడుగుపడి నీలమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, అక్క నాగేంద్రమ్మ కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే గమనించిన స్థానికులు ఆమెను నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలిపారు.

Advertisement

Next Story