మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం.. వంట‌గ్యాస్ లీక్, ముగ్గురికి తీవ్ర గాయాలు

by Shiva |   ( Updated:2024-07-18 17:35:55.0  )
మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం.. వంట‌గ్యాస్ లీక్, ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, గోపాల్‌పేట్: వంట గ్యాస్ లీకై భార్యభర్తలకు గాయలైన ఘటన మహబూబ్ నగర్ జిల్లా గోపాల్‌పేట్ మండల పరిధిలోని మున్నూరు గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సోడె వెంకటయ్య, చిట్టెమ్మ ఇంట్లో కొన్నాళ్ నుంచి వంట గ్యాస్ సిలిండర్ లీక్ అవుతోంది. ఈ క్రమంలోనే గురువారం గ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ ఆటో వారి వీధిలోకి రాగా.. మా ఇంట్లో గ్యాస్ లీక్ అవుతోంది కాస్త చూసిపెట్టమని వారు కోరారు. ఈ క్రమంలో వచ్చిన అతడు గ్యాస్ ఓపెన్ చేసి ఎక్కడ లీక్ అవుతుందని పరిశీస్తుండగా అగ్గిపుల్ల గీరారు. దీంతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురికి గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వాళ్లను చికిత్స నిమిత్తం వనపర్తి ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అక్క సరైన సదుపాయాలు లేకపోవడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story