- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిటైర్డ్ లేడీ టీచర్ దారుణ హత్య.. ఇంట్లో ఒక్కతే ఉన్నదని అర్థరాత్రి..!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో ఇటీవల క్రైం రేటింగ్ భారీగా పెరిగిపోతోంది. రాష్ట్రంలో రోజు ఏదో ఒకచోట హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. నేరాలు పెరిగిపోతున్నాయని వైఎస్ జగన్ ఆందోళనలు సైతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఓ రిటైర్డ్ లేడీ టీచర్ దారుణ హత్యకు గురికావడం సంచలనంగా మారింది. ప్రకాశం జిల్లాలో ఒకరోజు తర్వాత వెలుగుచూసిన ఈ మర్డర్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
చీరాలకు చెందిన పిల్లి లలిత ఉపాధ్యాయురాలిగా పని చేసి ఉద్యోగ విరమణ పొందింది. ఆమె కుమారుడు అమెరికాలో ఉంటున్నాడు. దీంతో గత కొంతకాలంగా లలిత ఒక్కతే ఇంట్లో ఉంటుంది. ప్రతి రోజు ఆమె కొడుకు అమెరికా నుంచి ఫోన్ చేసి మాట్లాడుతుంటాడు. యథావిధి బుధవారం ఉదయం కూడా ఫోన్ చేయడంతో ఆమె లిఫ్ట్ చేయలేదు. అలా మధ్యాహ్నం వరకు ఫోన్ చేసినా స్పందింకపోవడంతో అనుమానం వచ్చిన కుమారుడు పక్కింటి వాళ్లకు కాల్ చేసి విషయం చెప్పాడు. వాళ్లు వచ్చి చూసిసరికి లలిత రక్తపు మడుగులో పడి ఉంది.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో చీరాల పోలీసులు ఘటనా స్థలానికి చేరకుని పరిశీలించారు. అయితే దొంగతనం నేపథ్యంలోనే హత్య జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. లలిత ఇంట్లో రూ.30 వేలు చోరీకి గురైనట్లు తెలుస్తోంది. స్థానికంగా తిరిగే గంజాయి బ్యాచ్‌నే దొంగతనం చేసి హత్య చేసినట్లు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇటీవల గంజా బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోయాయని వాపోతున్నారు. పోలీసులు డాగ్ స్వాడ్‌తో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, లలిత కుమారుడు అమెరికా నుంచి వచ్చిన తర్వాతనే ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.
Read More..
Suicide Note: కన్నీరు పెట్టిస్తున్న సూసైడ్ నోట్.. మనస్తాపంతో విద్యార్థి బలవన్మణం