తల్లీకూతురిపై ఖైదీ అత్యాచారం.. ఎలా బయటకు వచ్చాడంటే..?

by Nagaya |   ( Updated:2024-01-29 14:56:40.0  )
తల్లీకూతురిపై ఖైదీ అత్యాచారం.. ఎలా బయటకు వచ్చాడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్ : హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ వ్యక్తి పెరోల్‌పై బయటకు వచ్చి మరో దారుణానికి పాల్పడ్డాడు. పరిచయం ఉన్న ఓ మహిళ ఇంటికి వెళ్లి ఆమెపై, ఆమె కూతురుపై అత్యాచారం చేశాడు. ఆపై చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన నాగ్‌పూర్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

నగరంలోని జరీపట్క ప్రాంతానికి చెందిన భరత్ గోస్వామి (33) 2014లో ఓ హత్య కేసులో దోషిగా తేలాడు. అప్పటి నుంచి అతడు జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే అతడు జైలులో సత్ప్రవర్తనగా మెలగడంతో ఇటీవల పెరోల్‌పై బయటకు వచ్చాడు. కాగా, గోస్వామి జనవరి 25న తనకు తెలిసిన 43 ఏళ్ల మహిళ ఇంటికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగక ఆమె 14 ఏళ్ల కూతురిపై సైతం అఘాయిత్యం చేశాడు.

కూతురుపై జరిగిన దారుణాన్ని జీర్ణించుకోలని మహిళ.. గోస్వామిని నిలదీసింది. అయితే ఈ అత్యాచారాల గురించి బయట ఎవరికైనా చెబితే ఇద్దరినీ చంపేస్తానని గోస్వామి బెదిరించాడు. అయినా బాధితురాలు ధైర్యం చేసి ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దుశ్చర్య బయటకు వచ్చింది. మహిళ ఫిర్యాదు మేరకు గోస్వామిపై భారత శిక్షాస్మృతి మరియు పోక్సో చట్టం కింద అత్యాచారం కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story