- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వరకట్న వేధింపులకు వివాహిత బలి
చేవెళ్ల దిశ : వరకట్న వేధింపులకు ఓ వివాహిత ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. మంగళవారం చేవెళ్ల ఎస్ఐ బ్రహ్మం తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా రాకంచెర్ల గ్రామానికి చెందిన లలిత కుమార్తె జ్యోతి (23)ని చేవెళ్ల మండల పరిధిలోని ఆలూర్ గ్రామానికి చంద్రయ్య కుమారుడు రాజు (30)కి 18 నెలల క్రితం వివాహం చేశారని తెలిపారు. వివాహం అయినప్పటి నుంచి రాజు జ్యోతిని అదనంగా వరకట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేశానడని, వివాహ సమయంలోనే రాజుకు 6 తులాల బంగారం, ద్విచక్ర వాహనం, రూ.5 లక్షల నగదును ఇచ్చామని బాధితులు తెలిపారని అన్నారు.
పెళ్లయిన అనంతరం జ్యోతి రాజు వద్ద కేవలం 4 నెలలే ఉన్నదని మిగతా రోజులు తల్లి జ్యోతి వద్దనే ఉన్నదని, గత మూడు రోజుల క్రితం రాజు తండ్రి చంద్రయ్య, ఇద్దరు పెద్దమనుషుల సమక్షంలో జ్యోతి ఉంటున్న తల్లిగారి ఇంటికి వెళ్లి నచ్చజెప్పి ఆలూర్ గ్రామానికి తీసుకువచ్చారు. ఈనెల 29వ తేదీన తన కూతురు జ్యోతి ఆలూర్ గ్రామంలోని తన ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నదని తెలిపారు. మృతురాలు తల్లి లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.