- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
తీవ్ర విషాదం.. రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
దిశ ప్రతినిధి, నిజామాబాద్/ బాసర: నిజామాబాద్ నగరానికి చెందిన యువతీ, యువకుడు నిర్మల్ జిల్లా బాసరలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం రాత్రి బాసర రైల్వే స్టేషన్ సమీపంలో నర్సాపూర్ - నాగర్సోల్ రైలు కిందపడి ఇద్దరు సూసైడ్ చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది. నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. నిజామాబాద్ నగరంలోని కోటగల్లికి చెందిన సూరం ప్రవీణ్(28), సీతారాంనగర్ కాలనీకి చెందిన నందిత(20)లు బాసర రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రవీణ్ నగరంలోని పాంగ్రలో గల విశ్వభారతి ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు.
నందిత నిశిత కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలిసింది. నందిత కాలేజీలో చాలా క్లెవర్ స్టూడెంట్ అని సహచర విద్యార్థులు తెలిపారు. యువకుడు ప్రవీణ్ సైతం సీన్సియర్ అని, వారి కుటుంబం ఆర్థిక కష్టాల్లో ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలిసింది. వీరిద్దరి మృతితో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఇద్దరి ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడం ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. రైల్వే పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.