- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:అక్రమ కర్ణాటక మద్యం పట్టివేత
దిశ ప్రతినిధి, కర్నూలు:కర్ణాటక అక్రమ మద్యం పట్టివేసినట్లు కర్నూల్ నాలుగో పట్టణ సీఐ శంకరయ్య పేర్కొన్నారు. బుధవారం కర్నూలు నగరంలో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు కర్నూల్ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సంపత్ నగర్ ఆర్చి వద్ద AP 21TX -6310 అనే మహేంద్ర బొలెరో మ్యాక్స్‌లో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన 52 బాక్సుల మద్యాన్ని పట్టివేసినట్లు సీఐ తెలిపారు. వాటి విలువ సుమారు 1,99,530 రూపాయలు ఇలా ఉంటుందని తెలిపారు. 90 ఎం.ఎల్ పరిమాణం గల 492 ఒరిజినల్ ఛాయిస్, డీలక్స్ విస్కీ పెట్రో ప్యాకెట్లు గుర్తించినట్లు తెలిపారు.
ఈ మద్యాన్ని గ్రామాల్లో అధిక రేట్లకు అమ్ముకుందామని వాటిని రవాణా చేస్తున్నట్లు ముద్దాయిలు అంగీకరించినట్లు అక్రమత్యం తరలిస్తున్న వారిలో కర్నూలు జిల్లాకు చెందిన క్రిష్ణగిరి మండలం గోకులపాడు గ్రామానికి చెందిన బోయ పూల జాను, మరియు బోయ ఆంజనేయులు, బోయ అంజని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. మహేంద్ర బొలెరో మాక్స్ వాహనం మరియు హోండా షైన్ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. ఎవరైనా అక్రమ మద్యం తరలిస్తే ఉపేక్షించేది లేదని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడుల్లో కర్నూల్ నాలుగో పట్టణ ఎస్సై పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.