- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
BREAKING: జగద్గిరిగుట్టలో పోలీసుల తనిఖీలు.. భారీగా గంజాయి చాక్లెట్లు, ముడి సరుకు స్వాధీనం
దిశ, వెబ్‌డెస్క్: డ్రగ్స్, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పోలీసులు దిశానిర్దేశం చేసింది. నిందితులు ఎవరైనా మాదక ద్రవ్యాలతో పట్టుబడితే కఠినంగా శిక్షించాలని ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేపడుతూ.. పెద్ద ఎత్తున గంజాయి, డ్రగ్స్ రవాణా అడ్డుకట్ట వేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టలోని ఓ కిరాణ షాపులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు గట్టుచప్పుడు కాకుండా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు ఎవరికీ అనుమానం రాకుండా జయశ్రీ ట్రేడర్స్ పేరుతో ఓ ముఠా గంజాయి చెక్లెట్లను తయారు చేస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు వారి నుంచి రూ.2.66 లక్షల విలువైన 6,400 గంజాయి చాక్లెట్లు, 4 కిలోల ముడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న మనోజ్‌కుమార్ (50) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.