Big Blast: స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 22 మందికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

by Shiva |   ( Updated:2024-08-24 17:33:23.0  )
Big Blast: స్టీల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 22 మందికి తీవ్ర గాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉక్కు కర్మాగారంలో భారీ పేలుడు సంభవించిన ఘటన మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో చోటుచేసుకుంది. బాయిలర్‌లో ఇనుమును మరగబెడుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కరిగిన ఇనుము కార్మికులపై పడటంతో దాదాపు 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేయగా రంగంలోకి దిగిన రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టింది. ఈ మేరకు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story

Most Viewed