- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Knife attack : మద్యం మత్తులో గొడవ... కత్తితో దాడి...
దిశ,కార్వాన్ : మద్యం మత్తులో గొడవ పడి కత్తితో దాడి చేసిన ఘటన సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,ఎస్సై మధు సూదన్ తెలిపిన వివరాల ప్రకారం...రాజగోపాల్, శేఖర్, నాని, సత్తార్ రజాక్ నలుగురు కోఠిలోని ఆంధ్రాబ్యాంక్ ఫ్లేవర్ కింద షాపులు ఉన్నాయి. వీరు ఈ నెల 22 న కోఠిలోని ఎస్వీ వైన్స్ లో కి సాయంత్రం వెళ్లి 2వ అంతస్తులో మద్యం సేవిస్తున్నారు. ఈ క్రమంలో నానిని రజాక్ తనకు ఇవ్వాల్సిన 500 రూపాయలు తిరిగి ఇవ్వాలని అడగగా రాజగోపాల్ ఇది సమయం కాదు అని సంజాయించారు. దీంతో నాని అక్కడి నుండి వెళ్లిపోయాడు.
ఈ క్రమంలో రజాక్ రాజగోపాల్ ను తాను ఒక మొబైల్ షాపు పెడుతున్నానని తనకు పార్టనర్ గా ఉండాలని అడిగాడు. అయితే దీనికి రాజాగోపాల్ నిరాకరించాడు. ఈ క్రమంలో రజాక్ కోపంతో చంపేస్తానని దుర్భాషలాడుతూ తన వద్ద ఉన్న కత్తితో రాజగోపాల్ పై ఎడమ వైపు చాతీ పై పొడిచి పారిపోయాడు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న రాజగోపాల్ తన స్నేహితుడి సహాయంతో ఉస్మానియా ఆసుపత్రికి వెళ్లాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి రజాక్ ను అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్ కు తరలించారు.
Read more...
- Tags
- Knife attack