ఇరాక్‌లో జగిత్యాల జిల్లా వాసి మృతి.. స్వగ్రామానికి చేరిన మృతదేహం

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-13 07:25:32.0  )
ఇరాక్‌లో జగిత్యాల జిల్లా వాసి మృతి.. స్వగ్రామానికి చేరిన మృతదేహం
X

దిశ, జగిత్యాల రూరల్ : జగిత్యాల రూరల్ మండలంలోని హబ్సిపూర్ గ్రామానికి చెందిన వంగ సురేష్ (38) ఇరాక్‌లో మృతి చెందారు. గత నెల 23న పెరలాసిస్ రావడంతో అస్పత్రిలో చేరగా చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటుకు గురై మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడికి భార్య వసంత, ఇద్దరు కుమారులు ఉన్నారు. నేడు గ్రామానికి మృతదేహం చేరగా, కుటుంబ సభ్యుల రోదనల మధ్య అంతక్రియలు పూర్తి చేశారు.

Advertisement

Next Story