- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
మైనర్ బాలిక పై అత్యాచారం చేసిన బాబాయ్..
దిశ, కొత్తకోట : వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. కొత్తకోట ఎస్సై మంజునాథ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలోని బుడగ జంగం కాలనీలో నివాసం ఉంటున్న 10 ఏండ్ల బాలిక పై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆమె బాబాయి ఆంజనేయులు (18) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధిత బాలిక తల్లిదండ్రులు తమ ముగ్గురు ఆడపిల్లలను నానమ్మ దగ్గర వదిలి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వలస వెళ్లారు.
ఇదే అదునుగా భావించి ఆంజనేయులు బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో ఇంట్లోకి వెళ్లి అత్యాచారానికి ఒడి కట్టాడు. విషయాన్ని ఆ బాలిక బయట నుండి వచ్చిన తన పెద్దమ్మకు తెలిపింది. ఆమె జరిగిన సంఘటన పై పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించి ఆ బాలికను వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలిక పెద్దమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. నిందితుడు ఆంజనేయులు పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం.