గర్ల్‌ఫ్రెండ్ ఇంటర్వ్యూ కోసం జైలు పాలైన యువకుడు.. ఎందుకంటే?

by Anjali |
గర్ల్‌ఫ్రెండ్ ఇంటర్వ్యూ కోసం జైలు పాలైన యువకుడు.. ఎందుకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: గర్ల్‌ఫ్రెండ్ కోసం కారు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఓ యువకుడు జైలు పాలు అయ్యాడు. ఈ ఘటన అమెరికాలోని అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. జెవోన్ పీరి జాక్సన్ (22) అనే యువకుడు తన ప్రియురాలిని ఇంటర్వ్యూ కోసం తీసుకెళ్తున్నాడు. అయితే, ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం వల్ల ఇంటర్వ్యూకి ఆలస్యం అవుతుందని భావించిన జాక్సన్ కారును అతివేగంగా నడిపాడు. దీంతో అతడు ఓ ట్రక్‌ను ఢీకొట్టబోయి తృటిలో ప్రమాదం నుండి తప్పించుకున్నాడు. రోడ్డుపై కారును అతివేగంగా నడపడం గమనించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. 64 కేఎంపీహెచ్ స్పీడ్‌తో వెళ్లే డీగ్రూడ్ రోడ్ దారిలో అంతకు మించిన వేగంతో జాన్సన్ వెళ్లడంతో అతడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతేకాకుండా అతడి లైసన్స్ అప్పటికే సస్పెండ్ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఇలా అనుమతులకు మించిన స్పీడ్‌తో ప్రయాణించడం జాక్సన్‌కు ఇది తొలిసారేమీ కాదని పోలీసులకు పేర్కొన్నారు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి బ్రెవర్డ్ కౌంటీ జైలుకు పంపారు.

Advertisement

Next Story

Most Viewed