- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Crime news : ప్రియుడితో కలిసి నాలుగేళ్ల కొడుకును చంపిన కసాయి తల్లి
దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ లోని సౌత 24 పర్గాణాస్ లో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో లో పడి ఓ కసాయి తల్లి తన నాలుగేళ్ల కొడుకును దారుణంగా హత్య చేసింది. కనుమరుగవుతున్న మావన సంబంధాలకు మచ్చుతునకగా నిలిచిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ లోని సౌత్ 24 పర్గాణాస్ జిల్లాలోని కుండకాళి గ్రామానికి చెందిన మఫూజా పియాడై అనే మహిళకు నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. పియాడై భర్త టోబ్ అలీ పియాడై పని రీత్యా కోల్‌కతాలో ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో కుల్తాలీ మండలంలోని గజీర్ హట్ గ్రామానికి చెందిన అబ్దుల్ హుస్సేన్ షేక్ (31) తో మఫూజా అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే మఫూజా తన ప్రియుడిని తరచుగా కలిసేది. కాగా మంగళవారం మరోసారి కలుసుకున్న వారిద్దరూ ఎక్కడికైనా దూరంగా లేచిపోయి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు.
అయితే తన కొడుకును తీసుకురావద్దని అబ్దుల్ కండీషన్ పెట్టాడు. దీంతో కొడుకు అడ్డు తొలగించుకోవాలనుకున్న మఫూజా.. బయట ఆడుకుంటున్న తన కొడుకును ఇంట్లోకి తీసుకెళ్లి ప్రియుడి సాయంతో రక్తాలు కారేటట్లు కొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలై ఆ బాలుడు చనిపోయాడు. అనంతరం ప్రియుడితో కలిసి మఫుజా అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిసరాలను పరిశీలించారు. ఘటనకు సంబంధించిన సమాచారాన్ని చుట్టు పక్కల వాళ్లను అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన బాలుడి తండ్రికి సమాచారం అందించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం బాలుడి మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు సీఐ మసూద్ హసన్ తెలిపారు.