- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..
దిశ, కొడిమ్యాల: ఉపాధి వేటలో ముగ్గురు మృత్యువాత పడిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెడిపెల్లి, భీమారం మండలానికి చెందిన ముగ్గురు యువకులు కోడిమ్యల మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్‌లో కేటరింగ్ పని నిమిత్తం బుధవారం ఉదయం వచ్చారు. పని ముగించుకుని తిరిగి వారి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో ప్రమాదం జరిగింది.
మండలంలోని కోనాపుర్ గ్రామ శివారులో సురంపేట నుండి కొడిమ్యల వైపు వస్తున్న డీసీఎం వ్యాన్.. యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులు మొసిన్ (17),అభిషేక్ (18),వరుణ్ గౌడ్‌లు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు గమనించి పోలీస్‌లకు సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మోసిన్, అభిషేక్ మృతి చెందారు. వరుణ్ గౌడ్ ను మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.