- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి..
దిశ, మహముత్తారం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మండలం దొబ్బలపాడు - కొర్లకుంట రహదారి పై అలుగువాగు వద్ద కాటారం వైపు నుండి వస్తున్న టాటా ఎస్ వాహనాన్ని యామనపల్లి నుండి ద్విచక్రవాహన దారుడు బలంగా ఢీ కొనడంతో ద్విచక్ర వాహన దారుడు. టాటాఏస్ లో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని నుండి ములుగు జిల్లా మంగపేటలో గల బంధువుల ఇంటికి వివాహానికి వెళ్తుండగా ప్రమాదానికి గురై చిల్ల సమ్మక్క (55) అక్కడికక్కడే మృతిచెందారు. కాగా ఊర శ్రీశైలం, మోట రాజేశ్వరికి తీవ్ర గాయాలయ్యాయి. టాటాఏస్ వాహనంలో ముగ్గురు చిన్నారులతో సహా మొత్తం 12 మంది ప్రయనిస్తున్నారు.
ప్రమాదానికి గురై మృతి చెందిన ద్విచక్ర వాహన దారుడు మండలంలోని కొర్లకుంటకు చెందిన చేరాల అశోక్ (30) పోలీసులు తెలిపారు. మృతిచెందిన అశోక్ ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన బీసీ కులవృత్తుల లక్ష రూపాయల సబ్సిడీ పథకం దరఖాస్తు కోసం మహముత్తరాం తహశీల్దార్ కార్యాలయం వచ్చి వెల్లుచుడగా ప్రమాదానికి గురై మరణించాడు. పోలీసులు క్షతగాత్రులను మహాదేవపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద బాధితులను పరామర్శించిన జడ్పీ చైర్మన్ పుట్ట మధు..
మండలం లోని దొబ్బలపాడు - కొర్లకుంట సమీపంలో ని అలుగువాగు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతిచెందిన కుటుంబ సభ్యులను సంఘటన పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు పరామర్శించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం కు త్వరగా తరలించాలని పోలీసులను ఆదేశించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు.