Breaking news : మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన AIR FORCE యుద్ధ విమానాలు

by Satheesh |   ( Updated:2023-01-28 07:12:26.0  )
Breaking news : మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన AIR FORCE యుద్ధ విమానాలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత వైమానిక దళంలో గంటల వ్యవధిలో ఘోర ప్రమాదాలు సంచలనంగా మారాయి. శనివారం ఉదయం మధ్యప్రదేశ్‌లోని మొరెనా సమీపంలో సుఖోయ్-30, మిరాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్‌లు కుప్పకూలాయి. ఢిఫెన్స్ అధికారుల సమాచారం ప్రకారం.. ఈ రెండు విమానాలు గ్వాలియర్ ఎయిర్ బేస్ నుండి ఇవాళ ఉదయం శిక్షణా కోసం బయలుదేరగా అంతలోనే ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

విషయం తెలుసుకున్న రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరితో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి రెండు విమానాలు ఢీ కొట్టడమే కారణమా అనేది ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ విషయాన్ని నిర్ధారించేందుకు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఈ ఘటనపై మొరెనా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదం తెల్లవారుజామున 5:30 గంటలకు సంభవించినట్లు తెలిపారు. ఎస్ యూ-30 నుంచి పైలట్‌లు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

రాజస్థాన్‌లో మరో విమానం:

మధ్యప్రదేశ్‌లో ఓ వైపు రెండు యుద్ధ విమానాలు కుప్పకూలగా.. శనివారం ఉదయం రాజస్థాన్ లోనూ మరో విమానం కూలిపోవడం కలకలం రేపింది. భరత్‌పూర్‌లో విమానం కుప్ప కూలిపోయింది. అయితే తొలుత ప్రమాదానికి గురైంది చార్టర్డ్ ఫ్లైట్ అని అంతా ప్రచారం జరిగినా తర్వాత ఇది వాయుసేనకు చెందిన యుద్ధ విమానమే అనే రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయని కొన్ని జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఒకే రోజు గంటల వ్యవధిలో వాయుసేనకు సంబంధించిన మూడు యుద్ధ విమానాలు ప్రమాదాల భారీన పడటం సంచలనంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed