- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వృద్ధుని హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్

దిశ, చార్మినార్ : కిరాణ దుకాణం ముందు కుర్చీలు వేసుకోనివ్వడం లేదనే కక్ష్యతో వృద్ధుని హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను కంచన్‌బాగ్ పోలీసులు అదుపులోకి తీసుకుని శనివారం రిమాండ్‌కు తరలించారు. శనివారం కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మీడియా సమావేశంలో కంచన్‌బాగ్ ఇన్స్పెక్టర్ శేఖర్‌రెడ్డి తో కలిసి చాంద్రాయణగుట్ట డివిజన్ ఏసీపీ మనోజ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. హఫీజ్‌బాబానగర్ సి బ్లాక్ కు చెందిన జాకీర్ ఖాన్ (53) అదే ప్రాంతంలో కిరాణదుకాణాన్ని నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన మీర్జా సలీం బేగ్ కుమారులు మీర్జా ఫహీం బేగ్ అలియాస్ ఫహీం (24) , మీర్జా అజీం బేగ్ అలియాస్ అజీం (27) లు జాకీర్‌ఖాన్‌కు చెందిన కిరాణా దుకాణం పక్కనే పాన్‌షాపు ను నడుపుతున్నారు. అయితే పాన్ షాప్ కు వచ్చిన కస్టమర్లను కిరాణ దుకాణం ముందు కుర్చీలు వేసి సిగరెట్లు తాగనిచ్చేవారు. దీంతో జాకీర్ ఖాన్ ఈ విషయంలో వారితో తరచు గొడవకు దిగేవాడు. మా దుకాణం ముందు కుర్చీలు వేయవద్దని, ఈ గిరాకీ దెబ్బతింటుందని పలుమార్లు హెచ్చరించాడు.
దీంతో వీరి మధ్య విభేదాలు ఉన్నాయి. జాకీర్‌ఖాన్ పై కక్ష్య పెంచుకున్న మీర్జా ఫహీం బేగ్, మీర్జా అజీం బేగ్ లు ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకుని అవకాశం కోసం ఎదురు చూశారు. ఇంతలోనే ఈ నెల 12వ తేదీన మరోసారి తన వద్దకు వచ్చిన కస్టమర్లకు కిరాణ దుకాణం వద్ద కుర్చీలు వేసి కూర్చోబెట్టాడు. ఆగ్రహించిన జాకీర్ ఖాన్ కస్టమర్లు కూర్చుకున్న కూర్చీలను ఒక్కొక్కటి లాగాడు. దీంతో కోపోద్రిక్తులైన మీర్జా ఫహీం బేగ్, మీర్జా అజీం బేగ్ లు ఖుర్షాన్లు జకీర్ ఖాన్ ముఖం, ఛాతి భాగాల్లో పిడిగుద్దులు గుద్దారు. ఒక్కసారి కిందపడిన జాకీర్ ఖాన్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న మీర్జా ఫహీం బేగ్, మీర్జా అజీం బేగ్ లను అదుపులోకి తీసుకుని శనివారం రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న ఖుర్షాద్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసును కంచన్‌బాగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.