- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సులోచనారెడ్డి హత్య కేసులో ట్విస్ట్.. పోలీసుల విచారణలో బట్టబయలైన కూతురి కుట్ర!
దిశ, తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణకాలనీలో గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడిచేసిన ఘటనలో గుజ్జుల సులోచనా రెడ్డి(45) అక్కడిక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. మృతురాలి భర్త సత్యనారాయణ రెడ్డి 20 ఏళ్ల క్రితం మరణించగా సులోచనా రెడ్డి తన కూతురు తేజశ్రీతో కలసి తల్లి బాలవ్వతో ఒకే ఇంట్లో ఉంటున్నారు. తమకున్న 6 ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కూతురు తేజశ్రీని చూసుకుంటున్నారు. 7 ఏడేళ్ల క్రితం తేజశ్రీ అదే గ్రామానికి చెందిన అరుణేందర్ రెడ్డి అనే యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. అప్పటి నుండి కుటుంబంలో ఆస్తి తగాదాల మొదలయ్యాయి. ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలని కూతురు, అల్లుడు, వియ్యంకుడు పలుమార్లు సులోచనారెడ్డితో గొడవ పడినట్లు సమాచారం. ఈ క్రమంలో తల్లి సులోచనా, కూతురు తేజశ్రీకి మధ్య దూరం పెరిగింది.
దసరా పండుగను అదునుగా భావించిన వియ్యంకుడు కృష్ణారెడ్డి ఆస్తిని దక్కించుకోవడం కోసం సులోచనా రెడ్డిని హతమార్చడానికి కుట్ర చేశాడు. సుఫారి మనుషులతో పక్కా ప్లాన్ సైతం వేసినట్లు సమాచారం. ప్రణాళికలో భాగంగానే పండుగజు తల్లి ఇంటికి వచ్చిన కూతురు తేజశ్రీ, అల్లుడు అరుణేందర్ రెడ్డి జరిగిందేదో జరిగిందంటూ ఇకనుంచి మంచిగా ఉందామని నమ్మించి సులోచనా రెడ్డిని కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేగాక, అడ్డొచ్చిన బాలవ్వపైనా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎల్ఎండీ ఏసీపీ కరుణాకర్ రావు, సీఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ ప్రమోద్ రెడ్డిలు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు.