Tragedy: కుప్పకూలిన సెల్లార్ గోడ.. అక్కడిక్కడే ముగ్గురు కార్మికులు దుర్మరణం

by Shiva |   ( Updated:2025-02-05 07:36:46.0  )
Tragedy: కుప్పకూలిన సెల్లార్ గోడ.. అక్కడిక్కడే ముగ్గురు కార్మికులు దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్/వనస్థలిపురం: హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. ఎల్బీనగర్‌లోని సితారా హోటల్ వెనుక ప్రాంతంలో సెల్లార్ తవ్వకాలు చేపడుతున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని మలుపల్లి గ్రామానికి చెందిన కూలీలు వీరయ్య (48), ఆయన చిన్న కుమారడు రాము (19) వీరయ్య బావమరిది కుమారుడు వాసు (18) పనులు చేస్తుండగా పక్కనే ఉన్న సెల్లార్ గోడ ఒక్కసారిగా కుప్పలకూలింది. వారంతా స్వగ్రామం నుంచి వలస వచ్చి అంబర్‌పేట్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. వారితో పాటు భిక్షపతి అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి కామినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఘటన జరిగిన సమయంలో సెల్లార్ పనుల్లో మొత్తం ఆరుగురు ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. మరో ఇద్దరి కోసం జేసీబీతో పోలీసులు తవ్వకాలు చేపడుతున్నారు.

Next Story