Tragedy: పుష్ప-2 షో సందర్భంగా మరో విషాదం.. మూవీ చూస్తూ వ్యక్తి మృతి

by Shiva |
Tragedy: పుష్ప-2 షో సందర్భంగా మరో విషాదం.. మూవీ చూస్తూ వ్యక్తి మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), రష్మిక మందన్నా (Rashmika Mandanna) నటించిన పుష్ప-2 (Pushpa-2) దేశ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. పాన్ ఇండియా (Pan India) సినిమాగా తెరకెక్కిన పుష్ప-2 నార్త్ ఇండియాలో బాక్సాఫీస్ (Box Office) వద్ద ప్రభంజనం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పుష్ప-2 (Pushpa-2) ప్రిమియర్ షో (Premiere Show) సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డు (RTC Cross Roads)లోని సంధ్య థియేటర్ (Sandhya Theatre) వద్ద జరిగిన తొక్కిసలాట మరువక ముందే ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) రాష్ట్రం‌లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

అనంతపురం జిల్లా (Ananthapuram District) రాయదుర్గం (Rayadurgam)లోని కేబీ ప్యాలెస్ థియేటర్‌ (KB Palace Theatre)లో సినిమా చూసేందుకు వచ్చిన మద్దానప్ప (37) హాలులోనే ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మద్దానప్ప మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యా్ప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Next Story

Most Viewed