ఓ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి

by Mahesh |
ఓ ఫ్యాక్టరీలో  భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు కార్మికులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. ఈ విషాద సంఘటన పంజాబ్ లోని హోసైరీ ఫ్యాక్టరీలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు 30 ఫైరింజన్లతో ఆరు గంటల పాటు శ్రమించారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story