ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి

by Shiva |
ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి
X

అందరూ హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వారే..

దిశ, వర్గల్ : ప్రమాదవశాత్తు చెరువులో పడి ముగ్గురు మృతి చెందిన ఘటన వర్గల్ మండల పరిధిలోని సాములపల్లి చెరువు వద్ద గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడలో బంధువుల ఫంక్షన్ గురువారం సాయంత్రం ఉండడంతో హైదరాబాద్ యాకుత్ పుర ప్రాంతానికి చెందిన కైసర్, సోహెల్, ముస్తఫా కుటుంబ సభ్యులు గజ్వేల్ మండలం మక్తమాసన్ పల్లి గ్రామంలో ఓ బంధువుల ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో వారు కుటుంబ సభ్యులతో కైసర్, సోహెల్, ముస్తఫా సరదాగా వర్గల్ మండలం సాములపల్లి గ్రామ చెరువు దగ్గరకు వెళ్లారు.

ప్రమాదవశాత్తు ముస్తఫా (4) చెరువులో పడడంతో అతడిని రక్షించే క్రమంలో కైసర్ (30), సొహెల్(17) చెరువులోకి దూకారు. వారిద్దరికీ ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోతుండటం గమనించిన కుటుంబ సభ్యులు లోబోదిబోమంటూ రోదించారు. చుట్టుపక్కల వారు ఈతగాళ్ల సాయంతో నీటిలో పడిన ముగ్గురిని చివరకు ఒడ్డుకు చేర్చారు. కానీ, వారు అప్పటికే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బేగంపేట ఎస్సై అరుణ్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story