- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువతిపై కిరోసిన్ పోసి చంపబోయారు..!
దిశ, వెబ్ డెస్క్: స్కూటీపై ఇంటికి వెళ్తున్న ఓ యువతిని మధ్యలోనే అడ్డగించారు కొందరు దుండగులు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి చంపబోయారు. ఈ ఘటన వెస్ట్ బెంగాల్ లోని నార్త్ 24 పర్గానాస్ జిల్లా బొన్ గావ్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొన్ గావ్ కు చెందిన రామకృష్ణపల్లి అనే యువతి హోమ్ ట్యూషన్ చెబుతూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం ట్యూషన్ నుంచి స్యూటీపై తిరిగొస్తున్న ఆమెను ఉజ్జల్ దాస్, రాజీవ్ ఘోష్, రాజేశ్ ఘోష్ అనే ముగ్గురు యువకులు అడ్డగించారు. అనంతరం ఆమెపై కిరోసిన్ పోసి సజీవం దహనం చేసేందుకు ప్రయత్నించారు. కానీ అదృష్టవశాత్తు ఆ యువతి వారి నుంచి తప్పించుకుంది.
అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. కొంతకాలంగా ట్యూషన్ వద్ద ఓ వ్యక్తి తనను వేధిస్తున్నాడని, ఈ దాడి వెనుక అతడి హస్తం ఉందని యువతి ఫిర్యాదు చేసింది. అరెస్ట్ చేసిన అనంతరం సోమవారం నిందితులను పోలీసులు బొన్ గావ్ సబ్ డివిజనల్ కోర్టులో హాజరుపరిచారు. నిందితుల నుంచి తమ కూతురుకు ప్రాణహాని ఉందని, వారిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులను కోరారు.