- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చెరువులో మునిగి ముగ్గురు చిన్నారుల మృతి..
దిశ, శామీర్ పేట : సరదాగా గడవలసిన దసరా సెలవులు విషాదంగా ముగిశాయి. ముక్కు పచ్చలారని ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడ్డారు. గ్రామ పెద్ద చెరువుకు పొద్దున ఆడుకునేందుకు వెళ్లిన చిన్నారులు నీటిలో దిగిన తర్వాత ఈత రాక మునిగిపోయారు. ఈ విషాదకర సంఘటన మేడ్చల్ జిల్లా ముడిచింతలపల్లి మండలం కొల్తూరు గ్రామంలో జరిగింది స్థానికుల పోలీసుల వివరాలు ప్రకారం కొల్తూరు గ్రామానికి చెందిన బాలేకర్ ఉసేన్ కుమారుడు మణిహర్ష (12), అలియాబాద్ సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఏడో తరగతి చదువుతున్నాడు. సలేంద్రి కనకరాజు లావణ్య దంపతుల కుమారుడు హర్షవర్ధన్ (10) లాల్ గడి మలక్పేట లోని సరస్వతి స్కూల్లో 6వ ఆరో తరగతి చదువుతుండగా, వీరబోయిన శోభ, స్వామి దంపతుల కుమారుడు మనోజ్ ( 11) కొల్తూరు జిల్లా పరిషత్ హై స్కూల్ లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ ముగ్గురు గ్రామంలోని యాదవ కాలనీలో నివాసం ఉంటున్నారు. పాఠశాలకు దసరా సెలవులు ప్రకటించడంతో శుక్రవారం ఉదయం సరదాగా ఆడుకునేందుకు ముగ్గురు విద్యార్థులు గ్రామ పెద్ద చెరువు వద్దకు వెళ్లారు. కొద్దిసేపు ఆడుకున్న అనంతరం చెరువులోకి దిగారు.
ఈత రాక నీట మునిగిపోయారు. ఈ సమయంలో చెరువు పరిసరాల్లో ఎవరు లేకపోవడంతో ప్రమాదం ఎలా జరిగిందో తెలియ రాలేదు. కాగా విద్యార్థులు నీట మునిగిన కొద్ది సమయానికి గ్రామానికి చెందిన కొంత మంది చేపలు పట్టడానికి చెరువు వద్దకు వెళ్లారు గాలం వేసినప్పుడు నీటి మునిగిన ఒక చిన్నారి బట్టలకు గాలం చిక్కింది. కాలానికి చేప పడింది అనుకొని బలంగా లాగగా విద్యార్థి మృతి దేహం బయటపడింది. అదే చోట మరో చిన్నారి మృతి దేహం లభించింది. ఈ విషయం గ్రామంలోనికి అందరికీ సమాచారం అందడంతో ముగ్గురు కలిసి ఆడుకోవడానికి చెరువు వద్దకు వచ్చినట్టు తేలింది. మూడో చిన్నారి కూడా అదే చెరువులో పడి మృతి చెంది ఉంటాడని గాలించగా అతని మృతదేహం కూడా లభించింది. పోలీసుల మృతి దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు. గ్రామంలో విషాదఛాయలు ఎంతో భవిష్యత్తు ఉన్న ముగ్గురు చిన్నారులు ఒకేసారి చెరువులో మునిగి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.