బషీరాబాద్ మండల పరిధిలోని పూజా ఎలాక్రానిక్ షాపులో చోరీ..

by Kalyani |   ( Updated:2023-05-17 15:57:53.0  )
బషీరాబాద్ మండల పరిధిలోని పూజా ఎలాక్రానిక్ షాపులో చోరీ..
X

దిశ, బషీరాబాద్: బషీరాబాద్ మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న పూజ ఎలక్ట్రానిక్ షాప్ యాజమాని సందీప్ సుగంధి సోమవారం సాయంత్రం 8 గంటలకు వ్యాపారం ముగించుకొని తాండూర్ కి వెళ్లిపోయాడు. బుధవారం తిరిగి తన షాపు వద్దకు వచ్చి చూడగా తన షాపు షట్టర్ తాళాలు తీసి ఉన్నాయి.

వెంటనే షాప్ యజమాని అయినా సందీప్ సుగంది షాపులోకి వెళ్లి చూడగా షాపులోని సామాన్లు చిందరవందరగా పడి ఉన్నాయి, షాపులోని సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్ వైర్లు కట్ చేసి డీవీఆర్ ను, క్యాష్ కౌంటర్ లో డబ్బును ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story