దేవుడిని కూడా వదలని దొంగలు

by Sumithra |
దేవుడిని కూడా వదలని దొంగలు
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో అర్ధరాత్రి ఓ దేవాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి తెగబడిన సంఘటన కలకలం రేపింది. బెల్లంపల్లి టూటౌన్ ఎస్సై ఆంజనేయులు కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కెమికల్ ప్రధాన రహదారి పక్కన ఉన్న కెమికల్ ఆంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి దుండగులు చోరికి పాల్పడ్డారు.

దేవాలయం తలుపులు పగలగొట్టి ప్రవేశించిన దొంగలు బీరువాను పగలగొట్టి నాలుగు తులాల వెండి హారం, రెండు వెండి కిరటా లు, రూ. 800 నగదును ఎత్తుకెల్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆంజనేయులు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed