- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అన్నను కడతేర్చిన తమ్ముడు..?
దిశ, వెల్గటూర్ : జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కుమ్మరిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి దారుణ హత్య జరిగింది. గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాలు ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్నదమ్ముల మధ్య చోటుచేసుకుంటున్న గొడవలకు పరాకాష్టగా విచక్షణ మరిచి ఆస్తి కోసం రక్తం పంచుకుని పుట్టిన అన్న బొమ్మల సుమన్ (36)ను తమ్ముడు డిల్లేష్ సోమవారం రాత్రి దారుణంగా హత్య చేశాడు. కుమ్మరి పల్లి గ్రామానికి చెందిన ఢిల్లీ సుమన్ ఇద్దరు రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములు. ఇద్దరికీ కుటుంబ కలహాలు ఆస్తి తగాదాల నేపథ్యంలో తరుచుగా గొడవలు జరుగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం ఇదే విషయంలో తమ్ముడు డిల్లేష్ పై అన్న దాడి చేయగా తృటిలో తప్పించుకున్నట్లు సమాచారం. ఆ గొడవ సద్దుమణిగింది. అయితే అన్న సుమన్ ను భార్య వదిలేసి వెళ్ళగా తల్లిదండ్రులతోనే కలిసి ఉంటున్నాడు. రాత్రి ఇంటిలో కూర మంచిగా లేదని కోడి గుడ్లు తెచ్చు కోవడానికి అతడు దుకాణం వద్దకు వెళ్ళాడు. దుకాణం అప్పటికే మూసివేసి ఉంది. తన పై దాడి చేసి చంపడానికి ప్రయత్నించాడని అన్న పై అప్పటికే మనసులో పగ ప్రతీకారం పెంచుకున్న తమ్ముడు అతన్ని రహస్యంగా వెంబడించాడు.
దుకాణం ముందరే ఎటాక్ చేసి పదునైన ఆయుధంతో దారుణంగా పొడిచి చంపారు. కోడిగుడ్ల కోసం వెళ్ళిన కొడుకు ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో అతని తల్లి వెతుక్కుంటూ దుకాణం వరకు వెళ్లేసరికి అతడు రోడ్డు పై శవంగా రక్తపు మడుగులో దుకాణం ముందు పడి ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా సీఐ రామ్ నర్సింహారెడ్డి, ఎస్ఐ ఉమాసాగర్ ఘటనాస్థలానికి చేరుకొని జరిగిన సంఘటన గురించి తెలుసుకొని అనుమానితులైన మృతుడి తమ్ముడు ఢిల్లేష్ తో పాటు గ్రామానికి చెందిన మరొకరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. జిల్లా కేంద్రం నుండి డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ రప్పించి వివరాలు సేకరించగా డాగ్ సంఘటనా స్థలం నుంచి సరాసరి మృతుడి తమ్ముడు ఇంటిలోకి వెళ్లి అతడు ధరించిన ఓ షార్ట్ ను బయటకు తీసుకువచ్చి పోలీసులకు అప్పగించింది. దాని పై రక్తం మరకలు ఉన్నట్లుగా గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే అన్నను తమ్ముడే చంపాడా, అతనికి ఎవరైనా సహకరించారా, లేదా ఇంకెవరైనా ఈ హత్యకు పాల్పడ్డారా అనే విషయం పోలీసుల విచారణలో తేలనుంది.