- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రాణహాని ఉందని బాధితుడి ఫిర్యాదు
దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ ఆటోనగర్ కు చెందిన షేక్ సుజత్ అలీ తనకు ప్రాణహాని ఉందని శుక్రవారం ఏసీపీ కిరణ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తనకు కొంతమంది స్నేహితులతో గతంలో ఆర్థిక లావాదేవీలు ఉండేవని, అందులో తాను పూర్తిగా నష్ట పోయానని తెలిపారు. అయినప్పటికీ దశల వారీగా తాను చెల్లించాల్సిన డబ్బు తిరిగి చెల్లిస్తున్నానని పేర్కొన్నాడు.
అయినప్పటికీ తనతో ఆర్థిక లావాదేవీలు ఉన్న ఆటోనగర్ కు చెందిన షేక్ సైఫ్, అజ్మత్ ఖాన్, మాలపల్లి నివాసి, నిస్సార్ వాజిద్ తనకు నిత్యం ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని షేక్ సుజత్ అలీ ఫిర్యాదులో పేర్కొన్నాడు.తన సోదరుడిని గతంలో కిడ్నాప్ చేశారని, ఈ విషయంపై ఆరో టోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని షేక్ సుజాద్ అలీ తెలిపారు.
తన సోదరిపై భౌతికంగా దాడి చేశారని ఆయన ఆరోపించాడు. వేధింపులను తట్టుకోలేక తాను, కుటుంబ సభ్యలు ప్రతి క్షణం తీవ్ర ఆందోళన గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. జిల్లా పోలీస్ యంత్రాంగం తన విషయంలో స్పందించి తనను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూజాద్ అలీ కోరాడు.