Rs.6 గుడ్డు కోసం యజమాని కిడ్నాప్.. ఒక్కడిని ముగ్గురు వ్యక్తులు బంధించి మరి..

by sudharani |   ( Updated:2023-04-25 14:38:16.0  )
Rs.6 గుడ్డు కోసం యజమాని కిడ్నాప్.. ఒక్కడిని ముగ్గురు వ్యక్తులు బంధించి మరి..
X

దిశ, వెబ్‌డెస్క్: కొంత మంది వ్యక్తులు క్షణికావేశాలకు పోయి చిన్న చిన్న తప్పులకే గొడవలు పెద్దవి చేసుకుంటారు. ఈ విధంగానే వ్యవహరించారు ముగ్గురు వ్యక్తులు. కోడిగుడ్లు అరువివ్వలేదనే కారణంతో ఓవ్యక్తిని కిడ్నాప్ చేసి మరీ దాడి చేశాడు. ఈ విచిత్ర సంఘటన బిలాస్ పూర్ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

బర్తోరి గ్రామానికి చెందిన యోగేష్ వర్మ అనే వ్యక్తి బిర్యాని సెంటర్ నడుపుతున్నాడు. కోహ్రడా గ్రామానికి చెందిన దీపక్ చతుర్వేది, రాహుల్ కుమార్ భాస్కర్, పరమేశ్వర్ భరద్వాజ్ అనే ముగ్గురు వ్యక్తులు ఆ బిర్యాని సెంటర్ వద్దకు వెళ్లి అక్కడ యజమానిని గుడ్లు అప్పుగా ఇవ్వమని అడిగారు. అందుకు యోగేష్ నిరాకరించడంతో ఆ ముగ్గురు వ్యక్తులు అనుమానంగా భావించారు.

ఈ క్రమంలోనే అదే రోజు సాయంత్రం 5:30 గంటల సమయంలో యజమానిని కిడ్నాప్ చేసి కారులో ముక్తిధామ్ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ అతడిని అసభ్య పదజాలంతో తిడుతూ దాడి చేశారు. అయితే కిడ్నాప్ సమాచారం అందుకున్న పోలీసులు యజమానిని రక్షించి ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కాగా.. కోడిగుడ్లు అప్పుగా ఇవ్వలేదని ఓ వ్యక్తిని కిడ్నాప్ చేయండంతో ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్‌గా మారింది.

Advertisement

Next Story