Crime News: 5 నెలల గర్భిణిని కిరాతకంగా నరికి చంపిన భర్త.. కారణం ఇదే?

by GSrikanth |   ( Updated:2022-08-25 06:51:56.0  )
Crime News: 5 నెలల గర్భిణిని కిరాతకంగా నరికి చంపిన భర్త.. కారణం ఇదే?
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో దారుణం జరిగింది. చిట్యాల గ్రామానికి చెందిన సంజీవ్, రమ్య(24) భార్యభర్తలు. మద్యానికి బానిసై సైకోలా వ్యవహరిస్తోన్న భర్త సంజీవ్ భార్యను తరచూ వేధిస్తుండేవాడు. తాజాగా.. మరోసారి తాగొచ్చి భార్యతో గొడవపడి ఇంటి ఆవరణలో భార్యను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. అనంతరం అదే గొడ్డలితో తాను కూడా తలపై బాదుకోవడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన కుటుంబ సభ్యులు అతడ్ని చికిత్స నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు. హత్యకు గురైన రమ్య ప్రస్తుతం ఐదు నెలల గర్భిణీ కావడం గమనార్హం.

Crime News: హిందూపురంలో వైద్య విద్యార్థిని అనుమానాస్పద మృతి

Advertisement
Next Story