- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గడ్డి తగలబెడుతుండగా రైతుకు అస్వస్థత
by Shiva |
X
దిశ, దౌల్తాబాద్ : గడ్డి తగలబెడుతుండగా రైతుకు తీవ్ర గాయాలైన ఘటన మండల పరిధిలోని శేరుపల్లి బందారం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన జక్కుల చంద్రయ్య అనే రైతు రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం పని నిమిత్తం తన పొలం వెళ్లాడు. ఈ క్రమంలో తన పక్క పొలంలోని వాళ్లు గడ్డిని తగబెడుతున్నారు. ఇదే సమయంలో గాలి విపరీతంగా వీస్తుండడంతో చంద్రయ్య వైపు మంటలు, పొగ ఒకేసారి రావడంతో ఊపిరాడక చంద్రయ్య కింద పడిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించి తోటి రైతులు చంద్రయ్యను 108 వాహనంలో గజ్వేల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు.
Advertisement
Next Story