- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నొప్పులు భరించలేక రైతు ఆత్మహత్య..
దిశ, భిక్కనూరు : ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గాయపడి చికిత్స చేయించుకుంటున్న వ్యక్తి గాయాల నొప్పులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోశనివారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే గ్రామానికి చెందిన గాడి భూమయ్య (45) గత ఎనిమిది నెలల క్రితం కరెంట్ షాక్ గురయ్యాడు. వైద్యం చేయించుకున్నప్పటికీ నొప్పులు తగ్గకపోవడం, రాత్రివేళ నిద్ర సరిగా పట్టడం లేదని కొద్దిరోజులుగా బాధపడుతున్నాడు. శుక్రవారం సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన భూమయ్య గుర్తు తెలియని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ విషయాన్ని చుట్టుపక్కల వ్యవసాయ బావుల వద్ద ఉండే రైతులు గమనించి వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి స్పృహ తప్పి పడిపోయిన భూమయ్యను 108 అంబులెన్స్ లో కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్సలు చేసిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు భిక్కనూరు ఎస్సై ఆనంద్ గౌడ్ తెలిపారు. భూమయ్య ఆత్మహత్యతో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆత్మహత్య చేసుకున్న భూమయ్యకు భార్య సుగుణ, కూతురు మౌనిక, కుమారుడు నితిన్ లు ఉన్నారు. ఈ మేర కేసునమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.