ప్రియుడితో కలిసి సొంత చెల్లెలి పట్ల దారుణంగా ప్రవర్తించిన అక్క!

by Anjali |
ప్రియుడితో కలిసి సొంత చెల్లెలి పట్ల దారుణంగా ప్రవర్తించిన అక్క!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రియుడితో కలిసి సొంత చెల్లెలిని అక్క హత్య చేసిన ఘటన బిహార్‌లోని వైశాలి జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. వైశాలి జిల్లాలో జిందాహా బ్లాక్‌లో తల్లిదండ్రులు, 13, 9 ఏళ్ల వయస్సున్న తమ ఇద్దరు కుమార్తెలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఇటీవల పేరెంట్స్ బంధువుల వివాహ వేడుక కోసం వేరే గ్రామానికి వెళ్లి, 5 రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె తన ప్రియుడిని ఇంటికి పిలిపించుకుని సన్నిహితంగా మెలిగింది. దీనిని తన చెల్లెలు చూసింది. ఆ బాలిక ఈ విషయాన్ని ఎక్కడ తన తల్లిదండ్రులకు, ఇరుగుపొరుగు వారికి చెప్తుందో అని భయంతో తన అక్క, ఆమె ప్రియుడు కలిసి ఆ అమ్మాయిని దారుణంగా హత్య చేసి డెడ్ బాడీని ఇంట్లోనే దాచిపెట్టారు. మూడు రోజుల తర్వాత మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో శవాన్ని నరికి యాసిడ్ పోసి.. ఇంటి పక్కన ఉన్న పెరట్లో పడేశారు.

తల్లిదండ్రులు ఇంటికి వచ్చాక, చిన్న కూతురు కనిపించకోవడంతో చెల్లి ఎటు వెళ్లిందని పెద్ద కూతురిని ప్రశ్నించారు. ఆడుకోవడానికి బయటకు వెళ్లొచ్చని చెప్పింది. సాయంత్రం అయినా రాకపోవడంతో వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్థులు మృతదేహాన్ని గుర్తించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. వారి దర్యాప్తులో ఆ డెడ్ బాడీ తప్పిపోయిన బాలికదిగా గుర్తించి, ఆమె తల్లిదండ్రులకు విషయం తెలిపారు. బాధితురాలి అక్కను పోలీసులు గట్టిగా అడగ్గా.. ఏడుస్తూ మొత్తం సంఘటనను బయటపెట్టింది. మే 16వ తేదీన బాలిక అదృశ్యమయ్యిందని, మే 19న ఆమె అవశేషాలు లభ్యమయ్యాయి. మంగళవారం సాయంత్రం నిందితులిద్దర్ని అరెస్టు చేశామని వైశాలి ఎస్పీ రంజన్ కుమార్ తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed