RTC Bus Driver:రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్?

by Jakkula Mamatha |   ( Updated:2024-11-06 13:43:16.0  )
RTC Bus Driver:రన్నింగ్ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు.. ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన కండక్టర్?
X

దిశ,వెబ్‌డెస్క్: బెంగళూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. బస్సు రన్నింగ్‌లో ఉండగా డ్రైవర్‌కు గుండె పోటు వచ్చింది. ఈ క్రమంలో ఆ డ్రైవర్ చేతిలో ఉన్న స్టీరింగ్ విడిచిపెట్టాడు. ఈ ఘటనను వెంటనే గమనించిన బస్సు కండక్టర్ అప్రమత్తమై స్టీరింగ్ పట్టుకుని బస్సును పక్కకి తీసుకెళ్లాడు. ఈ నేపథ్యంలో డ్రైవర్ గుండెపోటుతో కన్నుమూయగా, కండక్టర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. కండక్టర్ వెంటనే జాగ్రత్త పడకపోతే ఆ బస్సులోని ప్రయాణికుల ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. వివరాల్లోకి వెళితే.. బెంగళూరులోని BMTCకి చెందిన బస్సు నేలమంగళ నుంచి దశనపురాకు వెళ్తోంది. మార్గమధ్యంలో డ్రైవర్ కిరణ్ కుమార్ గుండెపోటుతో సీట్లోనే చనిపోయారు. వెంటనే స్పందించిన కండక్టర్ ఓబటేశ్, కిరణ్‌ను పక్కకి లాగి బ్రేక్ తొక్కి బస్సు ఆపేశారు. దీంతో బస్సులోని ప్రయాణికులకు, రోడ్డుపై వెళ్తున్న వారికి ప్రమాదం తప్పింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పలువురు స్పందిస్తూ కండక్టర్ సమయస్ఫూర్తి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story