- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
RR: రాజేంద్రనగర్ వ్యవసాయ కాలేజీ వద్ద ఘోర ప్రమాదం
దిశ, రాజేంద్రనగర్: అతివేగంగా వచ్చిన ఓ లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడకక్కడే దుర్మరణం చెందారు. 44వ నెంబర్ జాతీయ రహదారిపై రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని వ్యవసాయ విశ్వవిద్యాలయం సమీపంలో మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. శంషాబాద్ నుండి హైదరాబాద్ వస్తున్న కారు డ్రైవర్ నేచర్ కాల్ కోసం కాలేజీ గేటు సమీపంలో కారును రోడ్డు పక్కగా నిలిపాడు. అదే సమయంలో కర్నూల్ నుండి ఉట్టిలోడుతో హైదరాబాద్‌కు వస్తున్న లారీ కారును ఢీకొట్టి ఆ తర్వాత పల్టీ కొట్టింది.
ప్రమాదంలో లారీ డ్రైవర్ కుమ్మరి నర్సింహులు అక్కడికక్కడే మృతిచెందగా.. కారు డ్రైవర్ మాత్రం స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రమాదంలో కారు సైతం ధ్వంసం కాగా, కారులో బెలూన్లు తెరచుకోవడంతో డ్రైవర్‌కు ప్రమాదం తప్పింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన కారు డ్రైవర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, లారీ డ్రైవర్ నిద్ర మత్తులోకి జారు కోవడంతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.