- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3 రోజులు ఒక భార్యతో.. మరో 3 రోజులు ఇంకో భార్యతో ఉండాలని తీర్పిచ్చిన కోర్టు
దిశ, వెబ్‌డెస్క్: ఈరోజుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి. భర్త ఉండగా భార్య.. భార్య ఉండగా భర్త వేరే వాళ్లతో సంబంధాలు పెట్టుకుంటున్నారు. తాజాగా నోయిడాలో జరిగిన ఇలాంటి సంఘటనలో కోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది. ఓ వ్యక్తి తన భార్య ఉండగానే వేరే మహిళను వివాహం చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చాడు. అది తెలుసుకున్న మొదటి భార్య కేసు పెట్టడంతో న్యాయ సంస్థ ముగ్గురి అంగీకారం మేరకు తీసుకున్న తీర్పు ఇప్పుడు వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..
నోయిడాకు చెందిన ఓ వ్యక్తి సాఫ్‌వేర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి 2018లో 26 ఏళ్ల యువతితో వివాహం జరిగింది. వారిద్దరూ గుర్గావ్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా విధులు నిర్వహించేవారు. అయితే 2020లో ఆ యువతి గర్భవతి కావడంతో.. గ్వాలియర్‌లోని ఆమె తల్లిదండ్రుల ఇంటికి పంపించాడు. ఆ సమయంలో కోవిడ్-19 కారణంగా రాకపోకలకు ఇబ్బంది కలిగడం ఆ మహిళ పుట్టింట్లోనే ఉంచాడు భర్త. ఇదే సమయంలో ఆమె భర్త తమ కంపెనీలో చేసే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా అతడితో 2021లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్న ఆ వ్యక్తి మొదటి భార్య అతడిని ఇంటికి రావలని కోరింది.
ఇక అప్పటి నుంచి అతడు మొదటి భార్య నుంచి తప్పించుకోవడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో 2023 జనవరిలో మొదటి భార్య తన కుటుంబంతో కలిసి నోయిడాకు వెళ్లింది. తన భర్త వేరే మహిళను పెళ్లి చేసుకున్నాడన్న విషయం తెలుసుకుని అతడిపై కోర్టులో కేసు పెట్టింది. విచారణలో న్యాయస్థానం ముగ్గురు వాదనలు విని వినూత్న నిర్ణయం తీసుకుంది. అతనితో పెళ్లి చేసుకుని పిల్లలు కన్న ఇద్దరి భార్యలకు అతడి ఆస్తులు, సమయాన్ని సమానంగా పంచాలని తెలిపింది. అంతే కాకుండా వారంలో మొదటి మూడు రోజులు ఒక భార్యతో, తర్వాత మూడు రోజులు మరొకరితో ఉండాలని ఆదేశించింది. ఇక ఆదివారం తను ఇష్టమని చెప్పింది. ఒకవేళ అతను ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, మొదటి భార్య ఆ వ్యక్తిపై మళ్లీ కోర్టును ఆశ్రయించగలదని పేర్కొంది.
దీనిపై కౌన్సెలర్ హరీష్ దీవాన్ మాట్లాడుతూ “ఒక కౌన్సెలర్‌గా ఉన్నందున, సమస్యను పరిష్కరించడం మొదటి ప్రయత్నం. మొదటి భార్య తన బిడ్డకు భద్రతను కోరుకుంది.. అలాగే తన భర్తను జైలుకు పంపాలని కోరుకోలేదు. రెండవ భార్య మొదటి భార్యతో జీవించడానికి సిద్ధంగా ఉంది. కాని ఆ వ్యక్తి మొదటి భార్యతో జీవించడానికి ఇష్టపడలేదు. అయినప్పటికీ ఒప్పందం ప్రకారం అతడు తన ఇద్దరు భార్యల మధ్య ప్రతిదీ పంచుకోవడానికి అంగీకరించాడు" అని కౌన్సెలర్ చెప్పారు. కాగా.. “హిందూ వివాహ చట్టం, IPC ప్రకారం ఇది చట్టబద్ధం కానప్పటికీ.. ముగ్గురూ పరస్పర అవగాహనతో ఒప్పందంలోని నిబంధనల ప్రకారం జీవించవచ్చు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే, మొదటి భార్య కోర్టును ఆశ్రయించవచ్చని దీవాన్ పేర్కొన్నారు.