గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

by Dishaweb |
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం
X

దిశ,చౌటుప్పల్ టౌన్ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం శివారు తుర్కగూడెం రోడ్డులో సుమారు 40 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శనివారం చౌటుప్పల్ పోలీసులు అక్కడికి వెళ్లి సదరు వ్యక్తి మృతదేహాన్ని పరిశీలించి స్వాధీనం చేసుకున్నారు. మృతుడు యాచకుడై ఉంటాడని, అనారోగ్య సమస్యల కారణంగా, ఎండ తీవ్రత భరించలేక చనిపోయి ఉంటాడని తెలిపారు. ఎవరైనా ఇతనిని గుర్తిస్తే చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇచ్చి వివరాలు తెలియజేయాలని చౌటుప్పల్ పోలీస్ ఇన్స్పెక్టర్ దేవేందర్ కోరారు. స్థానిక ఎస్సై ప్రభాకర్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed