మహిళను రేప్ చేసి పెట్రోల్ తో తగలబెట్టిన యువకుడు

by Javid Pasha |
మహిళను రేప్ చేసి పెట్రోల్ తో తగలబెట్టిన యువకుడు
X

దిశ, వెబ్ డెస్క్: రాజస్థాన్‌ రాష్ట్రం బార్మర్‌లోని పచ్‌పద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ దళిత మహిళపై అత్యాచారం చేసి నిప్పంటించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ (44) ఇంట్లో ఒంటరిగా ఉంది చూసి అక్రమంగా ఇంట్లోకి చొరబడిన 44 షకూర్ ఖాన్ (30) అనే యువకుడు ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం విషయం బయటకు వస్తుందనే భయంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు. నిప్పంటుకోవడంతో తీవ్ర గాయాలపాలైన సదరు మహిళను స్థానికులు బలోత్రాలోని నహతా ఆసుపత్రికి తరలించారు. కానీ పరిస్థితి విషమించడంతో జోధ్‌పూర్‌ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అయితే చికిత్స పొందుతూ ఆ మహిళ ఇవాళ మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Advertisement

Next Story