అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..

by Hamsa |   ( Updated:2022-12-15 06:24:37.0  )
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి..
X

దిశ కొల్చారం: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి చెందిన సంఘటన గురువారం కొల్చారం మండలం చిన్న ఘనపూర్ శివారులో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన బైండ్ల గౌరవ్వ (45) గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతురాలు తన ఇంట్లో తను మాత్రమే ఉంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. గౌరవ్వ మృతదేహం పక్కన మద్యం సీసా, అన్నం కవర్లు, కల్లు కవర్లు, ప్లాస్టిక్ గ్లాసులు పడి ఉండడంతో ఆమె మృతి పలు అనుమానాలకు తావిస్తున్నది. గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లిన రైతులు ఆమె మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటనా స్థలాన్ని కొల్చారం ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. గౌరవ్వ మృతి పై గ్రామస్తులు అనుమానాలు వ్యక్తం చేయడంతో మెదక్ నుండి క్లూస్ టీం, జగిలాలను రప్పించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని మెదక్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

Also Read..

Vaishali Kidnapping Case: నవీన్ రెడ్డి స్టేట్‌మెంట్ కాపీలో సంచలన విషయాలు

Advertisement

Next Story