పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

by Shiva |
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
X

12 మంది అరెస్ట్, రూ.56 వేల నగదు, 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం

దిశ , కోనరావుపేట : పేకాట స్థావరంపై ఆకస్మికంగా దాడులు నిర్వహించి 12మందిని అదుపులోకి తీసుకున్న ఘటన తంగాలపల్లి మండలం మండేపల్లిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్సై మారుతి ఆధ్వర్యంలో తంగాలపల్లి మండలంలోని మండేపల్లి గ్రామ శివారులో గల ఎల్లమ్మ టెంపుల్ వద్ద బహిరంగంగా పేకాట ఆడుతున్నానే పక్కా సమాచారం మేరకు దాడి చేసి పేకాట ఆడుతున్న 12 మందిని అదుపులోకి తీసుకున్నారు.

అదేవిధంగా వారి నుంచి రూ. 56 వేల నగదు 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని విచారణ నిమిత్తం టాస్క్ ఫోర్స్ పోలీసులు తంగాలపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పగించినట్లు ఎస్సై మారుతి తెలిపారు. ఈ సదర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేలికగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పడి కొంత మంది చెడు వ్యసనాలు, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో నిత్యం టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిరహిస్తామని తెలపారు.

దాడుల్లో దొరికితే ఎంతటి వారైనా గ్యాంబ్లింగ్, బెట్టింగులు, పేకాట లాంటి జూదాల్లో భాగస్వాములైతే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. మీ ప్రాంతాల్లో ఎవరైనా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. పేకట స్థావరాన్ని కనిపెట్టి చాకచక్యంగా వ్యవహరించి పేకాట రాయుళ్లును పట్టుకున్న టాస్క్ ఫోర్స్ ఎస్సై మారుతి, సిబ్బంది శ్రీనివాస్, అక్షర్, డిస్ట్రిక్ట్ గార్డ్, సిబ్బందిని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story