- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీ బాలుర వసతి గృహంలో ఐదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి
దిశ ప్రతినిధి, నిజామాబాద్: బీసీ బాలుర వసతి గృహంలో ఐదో తరగతి చదువుతున్న సాయిరాజ్(11) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు ఈ సంఘటన కామారెడ్డి జిల్లా బీర్కూరు మండల కేంద్రంలో జరిగింది. శనివారం తెల్లవారుజామున సాయిరాజ్ అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. నసుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన గంగామణి మురళి దంపతుల ఏకైక సంతానమైన సాయిరాజ్ హాస్టల్‌లో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం రాత్రి హాస్టల్‌లో నిదురించిన సాయిరాజ్ తెల్లవారుజామున కాళ్లు చేతులు కొట్టుకోవడం గమనించిన వర్కర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో రెండు మాత్రలు ఇచ్చి పంపించడంతో వాటిని వేసుకునీ నిదురించిన సాయిరాజ్ నిద్రలోనే మృతి చెందాడు.
విషయం తెలిసిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వసతి గృహా వార్డెన్ పై మండి పడుతున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. ఈ పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. పాము కాటు వల్ల సాయిరాజ్ మృతి చెంది ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే సాయిరాజ్ నోటి నుంచి నురగలు రాకపోవడం పాముకాటు ఆనవాళ్లు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. రాష్ట్ర శాసనసభ అధిపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకు ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగుచూడగా తాజాగా ఐదో తరగతి విద్యార్థి అనుమానాస్పద మృతి అందరినీ కలిచి వేసింది.
ఇవి కూడా చదవండి : తెలంగాణ యూనివర్సిటీ వీసీ హల్‌చల్.. బయటి వ్యక్తులతో గర్ల్స్ హాస్టల్‌లోకి చొరబడి